గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరణ గ్రంధాలయ చైర్మన్ సంపత్ హుజూర్ నగర్ జనవరి 11 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణ గ్రంథాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పోలీసు, గ్రూప్స్, టీచర్ వంటి ఉద్యోగాలకు నెహ్రూ గ్రంథాలయంలో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం గ్రంధాలయ చైర్మన్ సంపత్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారన్నారు. బుధవారం ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ గ్రంథాలయంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో లైబ్రరీయన్ శ్రీధర్ రెడ్డి, వెంకట్, కృష్ణ ,విజయ్ ,చిట్టిబాబు, మనోజ్ ,రమేష్, రోజా, వీణా, మహేష్ ,రమేష్ పాల్గొన్నారు.
గ్రంథాలయానికి పుస్తకాలు బహుకరణ గ్రంధాలయ చైర్మన్ సంపత్




