.భువనగిరి టౌన్ జనం సాక్షి :–భువనగిరిమండలంలోనివడపర్తి గ్రామంలో గ్రామపంచాయతీ దగ్గర సర్పంచ్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 132 జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తూ గ్రామంలో అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపినారు కార్యక్రమంలో భాగంగా ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు యువకులు, తదితరులు పాల్గొన్నారు..




