Thursday, 5 November 2026

దుండ్ర పల్లి లో ఘనంగా డా బి ఆర్ అంబేత్కర్132వ జయంతి వేడుకలుదేశానికి డా బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివి.

 

 

 

 

 

బోయిన్ పల్లి. ఏప్రిల్.14.(జనం సాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం పల్లి గ్రామంలో శుక్రవారం రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు పండ్లు పంపిణీ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ దేశానికి డా బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివనీ కొనియాడారు.  బి ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే పేరొందిన గొప్ప న్యాయవాది, మానవతా వాది అని పేర్కొన్నారు. లండన్ లో ప్రముఖ విశ్వ విద్యాలయం డా బి ఆర్ అంబేద్కర్ కు మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ప్రధానం చేసిందన్నారు. ఆర్థిక శాస్త్రంలో మొదటి పి హెచ్ డి చేసిన వ్యక్తి డా బి ఆర్ అంబేద్కర్ రే నని చెప్పారు. అన్ని అంశాల్లో పట్టున్న గొప్ప సామాజిక సంఘ సంస్కర్త డా బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ రూపకల్పన లో కీలకమైన ముసాయిదా కమిటీ కి చైర్మన్ గా వ్యవహరించారనీ చెప్పారు. దేశానికి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగము ను రాసి భవిష్యత్తులో దేశం ఎదుర్కొనే అనేక సవాళ్లకు పరిష్కార మార్గాలు చూపారని  కొనియాడారు. దేశానికి డా బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివనీ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందుల కరుణ గంగారెడ్డి ఉప సర్పంచ్ రవి లచ్చయ్య రామ్ రెడ్డి శ్రీనివాస్ అంబేద్కర్ సంఘం నాయకులు రాజయ్య మల్లయ్య బుచ్చి లింగం, రమేష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు