గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి
— జిల్లా అధ్యక్షులు మాలోత్ సతీష్ నాయక్
టేకులపల్లి, అక్టోబర్ 30( జనం సాక్షి):గ్రామపంచాయతీలలో పనిచేసే కార్మికులకుకనీస వేతనం చెల్లించాలని గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు మాలోత్ సతీష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం టేకులపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ (సిఐటీ యు అనుబంధం) టేకులపల్లి మండలంలో మూడవ మండల మహాసభ జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సతీష్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని, వేతనాలను సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం డివిజన్ నాయకులు ప్రవీణ్ నాయకత్వo లో నూతన మండల కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మండల కమిటీ అధ్యక్షులుగా బాదావత్ వీరన్న నాయక్ , మండల కార్యదర్శిగా బిచ్చు లను ఈ మహాసభ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండలపరిధిలోని కార్మికులు పాల్గొన్నారు.




