వలిగొండజనం సాక్షి న్యూస్ జూన్ 26 మండలంలోని దాసి రెడ్డిగూడెం గ్రామ పంచాయతీ భవనాన్ని సోమవారం జిల్లా పంచాయతీ రాజ్ అధికారిని సునంద మండల ఎంపీడీఓ లెంకల గీతారెడ్డిలు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ భవనం యందు నూతనంగా నిర్మించిన ప్రత్యేక గదులను పర్యవేక్షించారు. అనంతరం సర్పంచ్ కొమురెల్లి సరిత సంజీవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్లరేపాక సింగిల్ విండో డైరెక్టర్ కొమురెల్లి సంజీవరెడ్డి పోచంపల్లి ఎంపీఓ మజీద్ పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్ హేమలత వార్డు మెంబర్లు కునపూరి శ్రీశైలం దంతూరి నరేష్ కుమార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన:డీపీఓ




