జనం సాక్షి/ కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగలగరి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కొల్చారం, పోతంశెట్టిపల్లి గ్రామాల్లో ఇటీవల మరణించిన కుటుంబాలను పరామర్శించి వారికి మనోధైర్యం నింపి ఆర్థిక సాయం అందించడం జరిగింది.
పోతంశెట్ట్టి పల్లిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎర్ర భీముడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించడం జరిగింది.
కొల్చారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చౌరిగారి కిష్టయ్య కుటుంబ సభ్యులు పరామర్శించి ఓదార్చారు. అలాగే పార్తి గారి లక్ష్మయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి డివిజన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏళ్ళుగారి శ్రీనివాస్ రెడ్డి, కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్ పట్లూరి అనిల్ కుమార్. మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి. మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అక్రం. చిన్న గణపురం పిఎసిఎస్ డైరెక్టర్ చంద్రపురం మధుసూదన్ రెడ్డి. చిన్న గణపురం గ్రామ శాఖ అధ్యక్షులు పుల్లబోయిన మల్లేష్ ముదిరాజ్. యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు పుల్లబోయిన దుర్గేష్ ముదిరాజ్. యువజన కాంగ్రెస్ నాయకులు చౌరి గారి వెంకటేశం గాజుల కలీం. డాక్టర్ బాలరాజ్ గడ్డమీద రాములు శంకర్ సత్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
పలు కుటుంబాలను పరామర్శించి టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజి రెడ్డి




