టీపీసీసీ పిలుపు మేరకు బోయినపల్లి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ముందు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం


బోయినపల్లి జులై 12 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ముందు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేసారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు వన్నెల రమణ రెడీ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కుస రవీందర్ మాట్లాడుతూ.బీఆర్ఎస్ బీజేపీ కి బి టీం అని మరోసారి నిరూపితమైందనీఅన్నారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటుకు నిరసనగా సత్యాగ్రహ దీక్ష పిలుపుని నీరుగార్చాలని, ఉచిత విద్యుత్ పైకి దృష్టి మరల్చాలని ప్రయత్నిస్తుంది.బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేసిందని. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుంది. తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కెసిఆర్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో తడగొండ ఎంపీటీసీ సభ్యులు ఉయ్యాలా శ్రీనివాస్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు అనుముల హరికృష్ణ,మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్,పొన్నం మధు,పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి, కళ్లెపెల్లి సతీష్, కనుకయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు నిమ్మ వినోద్ రెడ్డి, నక్క శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు