Friday, 6 November 2026

శ్రీ షిరిడి సాయిబాబా మందిర ప్రథమ వార్షికోత్సవం

శ్రీ షిరిడి సాయిబాబా మందిర ప్రథమ వార్షికోత్సవం

… మందిరంలో ప్రత్యేక పూజలు

మానకొండూరు, ఆర్ సి, డిసెంబర్ 12( జనం సాక్షి)

శుభ కృత నామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ఈనెల 18న మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ వాల అంజుత్ రావు, కమిటీ సభ్యులు తెలిపారు. వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం ఉదయం ఆరు గంటల 30 నిమిషాలకు కాగడ హారతి, ఉదయం ఎనిమిది గంటలకు సాయిబాబా పల్లకి సేవ, ఉదయం 11:15 నిమిషాలకు శ్రీ గణపతి హోమం, దత్తాత్రేయ సాయిబాబా మూల మంత్ర హోమం, మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు మధ్యాహ్న హారతి పూజలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధన, వస్తు రూపేనా సహకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని నిర్వాహకులు కొరారు. పూజలో పాల్గొనే భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని వివరాలకు జనరల్ సెక్రెటరీ రంగు శ్రీనివాస్ సెల్ నంబరు 7729988488, ట్రేజరర్ సురేష్ సెల్ నెంబరు 9704533435 నంబర్లను సంప్రదించి వివరాలు పొందవచ్చునని వారు తెలిపారు.