వేమనపల్లి,ఏప్రిల్ 28,(జనంసాక్షి):నీల్వాయి గ్రామపంచాయతీలో సర్పంచ్ గాలి మధు అధ్యక్షతన స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ అంశంపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యంగా ఘన వ్యర్తల నిర్వాహణ,ద్రవ వ్యర్థాలు నిర్వాహణ,నీటి సంరక్షణ పద్దతులను గూర్చి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సభకు ముఖ్య అతిథులుగా నీల్వాయి ఎంపీటీసీ ఆర్ సంతోష్ కుమార్,ఎంపీడీవో అల్లూరి లక్ష్మయ్య, ఎంపీఓ శ్రీపతి బాపురావు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నఫీజా బేగం, ఏపీవో సత్యప్రసాద్, ఏపిఎం ఉమారాణి,ఈసీ మధు, పంచాయతీ కార్యదర్శి అశోక్,వార్డు సభ్యులు,కో ఆప్షన్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




