వీణవంక ఏప్రిల్ 28 (జనం సాక్షి ) వీణవంక మండల కేంద్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను, తడిసన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు,కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు రైతు అరుగాలం కష్టపడి పండించిన పంట దెబ్బ తినడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మండలంలోని పలు గ్రామలలో రైతులు వరికోతలు ప్రారంభించి సుమారు 20రోజులు గడుస్తున్న ఐకేపీ కేంద్రంలో నేటికీ కొనుగోళ్లు ప్రారంభించలేదు అన్నారు ఇప్పటివరకు ఒక కిలో ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల్లో కొనుగులు చేయలేదన్నారు ట్రాక్టర్లు లేక కొనుగోలు చేయడం లేదని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే తడిసిన వరి ధాన్యన్ని ఎటువంటి తరుగు తీయకుండా వెంటనే కొనుగోలు చేయాలని పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించాలని ఎండి సాహెబ్ హుస్సేన్ అన్నారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి వడ్డేపల్లి కొమురయ్య చదువు జైపాల్ రెడ్డి ఈదునూరి పైడి కుమార్ సుకాశి యాదగిరి ఎండి రజాక్ అడిగొప్పుల వెంకన్న ఎండి అన్వర్ సుకాశి సూరయ్య రైతులు హమాలీలు తోపాటు తదితరులు పాల్గొన్నారు




