Thursday, 5 November 2026

గ్రామాలకు అధిక నిధులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

గ్రామాలకు అధిక నిధులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బషీరాబాద్ డిసెంబర్ 07,(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో బుధవారం రోజున స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇస్మాయిల్ పుార్, నీలపల్లి,నీలపల్లి తండా,జలాల్ పుార్,జలాల్ పూర్ తండా, మర్పల్లి,పార్వత్ పల్లి,హంక్య నాయక్ తండా,బాబునాయక్ తండా,బోజ్యనాయక్ తండా,
నవల్గా గ్రామలను
పర్యటించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గతంలో తాండూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేశారు.కానీ నియోజకవర్గం అభివృద్ధి మాత్రం చేయలేదని నేను వచ్చాక మన తాండూరు నియోజకవర్గానికి అభివృద్ధి జరుగుతుందని అందుకు సీఎం కేసీఆర్ దగ్గర నియోజకవర్గం అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు కావాలని తాండూర్ నియోజకవర్గానికి 135 కోట్ల రూపాయలు తీసుకువచ్చానని చెప్పారు.ప్రస్తుతం గ్రామానికి 50 లక్షల నిధులు మంజూరైన కాబట్టి ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, మురికి కాలువలు గ్రామాభివృద్ధికి చేసుకోవచ్చని తెలిపారు.గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం, రైతుల కోసం రైతు బంధు,రైతు బీమా, రైతు వేదికల నిర్మించామని,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, పింఛన్లు, మరెన్నో పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాము నాయక్, పిఎసిఎస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, టీఎర్ఎస్ సీనియర్ నాయకులు నర్సిరెడ్డి (రాజు రెడ్డి), రాఘుమ రెడ్డి, పాండు రాంగ రెడ్డి,ముకుంధు,సూర్య నాయక్,
వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, కార్యకర్తలు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గ్రామ ప్రజలు, తదితులు పాల్గొన్నారు