Friday, 6 November 2026

నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాటేత్తని కేసీఆర్

నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాటేత్తని కేసీఆర్*
జగిత్యాల జిల్లా పర్యటన జిల్లా ప్రజలను మొత్తంగా నిరాశపరిచింది ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గానికి చెందినటువంటి మన జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట ఎత్తలేదు.టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వంద రోజులలో షుగర్ ఫ్యాక్టరీని స్వాధీన పరుచుకొని తెరిపిస్తానని బూటకపు హామీలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది చెరుకు రైతులు మరియు రైతు సంఘం నాయకులంతా నిన్న సీఎం కేసీఆర్ పర్యటనలో శుభవార్త వింటారని ఆశపడ్డారు. కానీ సీఎం కేసీఆర్ షుగర్ ఫ్యాక్టరీ మాటే,ఊసే ఎత్తలేదు. ఈ సందర్భంగా మెట్పల్లి పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇక్కడి ప్రాంతాల రైతులను మోసం చేసిన కోరుట్ల నియోజకవర్గం టిఆర్ఎస్ నాయకులకు గాని ఈ ప్రభుత్వానికి గాని ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు జిల్లాలో ఉన్న అనేక పెండింగ్ సమస్యలకు పరిష్కారాలు సమాధానాలు చూపకుండానే సీఎం కేసీఆర్ వెనిదిరిగారు.సీఎం కేసీఆర్ పర్యటనను ఎక్కడ అడ్డుకుటారానని,నిరసన తెలుపుతరాన్ని,కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ నాయకులు అన్నారు.ఈ అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో కాంగ్రెస్ పార్టీ పోరాటాలను ఆపలేరని అన్నారు.తక్షణమే నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి ఈ ప్రభుత్వం ఒక కార్యచరణను రూపొందించాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిపిసిసి నాయకులు మెట్పల్లి జెడ్పిటిసి కటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి,బీసీ సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం వెంకటేష్ గౌడ్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఎద్దండి మోహన్ రెడ్డి పరుష తుకారాం,ధోని రాజు,చల్ల నందు,ఔదుర్తి మహేష్,రెహమాన్ తదితర
కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.