గ్రామాలలో వై ఎస్ ఆర్ టి పార్టీ జెండా ఆవిష్కరణ

తెలంగాణ ప్రజల సంక్షేమమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పార్టీ లక్ష్యం అని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని అచ్చుమాయిపల్లి, అప్పనపల్లి, పెద్దగుండవెళ్లి,పద్మనాభునిపల్లి గ్రామంలలో శనివారం రోజున పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం కర పత్రలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ బాటలోనే పయనించి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.తండ్రి బాటలో తనాయురాలు గా తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు,వై ఎస్ ఆర్ టి పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, యాదగిరి లు,కార్యకర్తలు పాల్గొన్నారు.