Wednesday, 4 November 2026

గ్రామాల్లో ఉత్సవాలు గ్రామ ఐక్యత కు నిదర్శనం ఎం ఎల్ ఏ నోముల భగత్ కుమార్

 

 

 

 

 

 

 

తిరుమలగిరి (సాగర్) ఫిబ్రవరి 07 (జనంసాక్షి): మండలములోని సుంకిశాల తండా గ్రామం లో శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతరలో నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు నోముల భగత్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో ఉత్సవాలే గ్రామస్తుల ఐక్యతకు నిదర్శమని, అందరూ ఐక్యంగా పండగ చేసుకుని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు పిడిగం నాగయ్య,ఎంపీటీసీ భార్గవి శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ లు శంకర్ నాయక్, రోషి రెడ్డి,జాల పాపయ్య. బొల్లిగొర్ల ఎల్లయ్య. బొల్లిగొర్ల కాశయ్య.గ్రామ శాఖ అధ్యక్షులు రామావత్ భీమా, కొడావత్ హనుమంత్,యుగేందర్.సోమయ్య. లకపతి నాయక్, పాల్థి శంకర్ గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.