Wednesday, 4 November 2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

ఏటూరునాగారం(జనంసాక్షి)జూన్15.ఈ రోజు మండల కేంద్రంలోని బి ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన జాతీయ మానవ హక్కుల కమిటీ ములుగు జిల్లా అధికార ప్రతినిధి పర్వతాల రమేష్- రాణి వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎలకంటి రాజు, ములుగు మండల అధ్యక్షులు అజ్మీరా దేవిసింగ్, మంగపేట మండల అధ్యక్షులు గాదె శ్రీనివాసచారి, ఏటూరునాగారం మండల అధ్యక్షులు అల్లంల చంటి యాదవ్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.