Wednesday, 4 November 2026

గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణకు పల్లె ప్రకృతి వనాలు… డంపింగ్‌యార్డులను నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి,పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధి.

 

గంగారం 15(జనం సాక్షి):దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మర్రిగుడెం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జాతీయ జెండా ఎగురవేశారు.అనంతరం పల్లె ప్రగతి ద్వారా,గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను,వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధిని,గ్రామంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను గ్రామ పంచాయితీ కార్యదర్శి ప్రతిభ భారతి వివరించారు.గ్రామ పారిశుద్ధ్యం,పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరు.ఈసమావేశంలోపల్లెప్రగతివిజయాలను,జిల్లా,రాష్ట్ర,స్థాయిలో సాధించిన అవార్డులు పారిశుద్ధ్యం మెరుగు పడటం వల్ల సీజనల్ వ్యాధులు తగ్గిపోయిన తీరును ప్రముఖంగా ప్రస్తావించి,గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగిన తీరును ప్రస్తావించారు.గ్రామ పంచాయతీ కారోబార్ నాగేశ్వర్ ను అంగన్వాడి సూపర్వైజర్ రామలక్ష్మి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ సుశీల, గ్రామ ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.