వలిగొండ జూన్ 15 (విజన్ ఆంధ్ర) తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం మండలంలోని పైల్వాన్ పురం దాసిరెడ్డిగూడెం రెడ్లరేపాక కంచనపల్లి గ్రామాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం ర్యాలీగా డంపింగ్యార్డ్వైకుంఠధామాలలో.పల్లె ప్రగతి నిర్వహించారు. గ్రామపంచాయతీ సిబ్బందికి బెస్ట్ మల్టీ పర్పస్ అవార్డు సన్మానం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ తుమ్మల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలు 21 రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో నిర్వహిస్తున్నారని గ్రామ గ్రామాన అభివృద్ధి ఇంటింటా సంక్షేమంతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన పారదర్శకంగా కొనసాగుతుందన్నారు ముఖ్యమంత్రి రైతులకు కొండంత అండగా నిలబడ్డారని రైతులు దేనికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు వ్యవసాయం దండగ అన్న దశ నుంచి పండుగ అన్న దశకు వ్యవసాయ రంగాన్ని తీసుకువెళ్లిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కొమురెల్లి సరిత సంజీవరెడ్డి రేపాక అరుంధతి రమేష్ రెడ్డి కొమురెల్లి రమా బాలకృష్ణారెడ్డి ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు వార్డు మెంబర్లు ఆశా కార్యకర్తలు అంగన్వాడి కార్యకర్తలు గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు




