రేవంత్ రెడ్డి వెటకారపు వ్యాఖ్యల పట్ల ఎంపిపి హరికృష్ణ ఆగ్రహం
శివ్వంపేట జూలై 11 జనంసాక్షి : దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండగ చేయాలనే లక్ష్యంతో 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే అది చూసి ఓర్వదాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రైతుల పట్ల వెటకారపు వ్యాఖ్యానాలు చేయడం సరైనది కాదని జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. తెలంగాణ రైతులకు ప్రభుత్వం ఇస్తున్నా 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని విషం చిమ్మడంపై ఎంపీపీ మంగళవారం మండల కేంద్రమైన శివ్వంపేట లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ 14 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ, వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే దానిని వ్యతిరేఖీస్తూ ఎనిమిది గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని వెటకారంగా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడితే రానున్న రోజుల్లో రైతులే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ నాయిని వేణుగోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.