గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి-అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

అలంపూర్ జూలై 11(జనంసాక్షి )
గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసి గ్రామాలను అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది              అని అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం అన్నారు.అలంపూర్ నియోజకవర్గం లోని వడ్డేపల్లి మండలం కొంకలా గ్రామంలో మంగళవారం 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమ నీకి ముఖ్య ఆహ్వానితులుగా హాజరై భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.  డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు,అలంపూర్ నియోజక వర్గనీ అని రంగాలలో అభివృద్ధి చేస్తానాని అన్నారు. గ్రామ గ్రామన వైకుంఠ దామలు,డంపింగ్ యర్డ్స్,పల్లె ప్రకృతి వనలు ఏర్పాటు చేయడం జరిగింది అని ఆయన అన్నారు.పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అని ఆయన అన్నారు.పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగింది అని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో చేపట్టిన సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలే కారణమన్నారు. యావత్ భారతదేశంలో వ్యవసాయాన్ని పండుగ గా మార్చింది, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే నని ఆయన చేపట్టిన రైతుబందు,రైతు భీమా,రుణమాఫీ లు దేశానికే దిక్సూచిగా నిలిచాయాన్నారు.కళ్యాణ లక్ష్మి ,కేసీఆర్ కిట్,కంటివేలుగు,ఆసరా ఫించన్,మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ పథకాలు అభివృద్ధికి ప్రతిబాంబిస్తున్నాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి జెడ్పిటిసి రాజు, సర్పంచ్ అంజి,తిరుమల్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, పరమేష్ గౌడ్, పి ఏ సి ఎస్ చైర్మన్ గోపాల్ రెడ్డి,ప్రజా ప్రతినిదులు BRS పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు