గ్రామాల అభివృద్ధియే తెలంగాణ రాష్ట్రప్రభుత్వ
రాజంపేట్ డిసెంబర్ 7 (జనంసాక్షి)
మండలంలోని తలమడ్ల గ్రామాల అభివృద్ధియే తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. మండలంలోని తలమడ్ల గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా రాశి వనం, రైతు వేదిక, క్రీడా ప్రాంగణం, సిసి రోడ్లు, వైకుంఠధామం, సుమారు 5 లక్షలతో నిర్మించినటువంటి సైన్స్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. గ్రామంలో ప్రతి వాడ తిరుగుతూ ప్రజల యొక్క ఇబ్బందులను, రాష్ట్రప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో అందుతున్నాయా అని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదవ రెడ్డి, జడ్పీటీసీ కొండ హన్మాండ్లు, ఎంపీపీ లింగాల స్వరూప,ఏఎంసీ చైర్మన్ భగవతి రెడ్డి,డిసిసిబి డైరెక్టర్ సిద్ధ రాములు,ఎంపీటీసీ రాజు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బిక్కజీ బాల్వంత్ రావు, పిఎసిఎస్ చైర్మన్ నల్లవెల్లి అశోక్, మండల రైతుబంధు కమిటీ అధ్యక్షులు జూకంటి మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ దుబ్బాని సావిత్రి, ఎస్ఎంసి చైర్మన్ నాముడ్ల స్వామి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, రైతుబంధు జిల్లా సభ్యులు బాల్రెడ్డి, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు నముండ్ల రాజలింగం, సీనియర్ నాయకులు మాలిష్ కమలాకర్ రావు, పిఎసిఎస్ డైరెక్టర్ శివకుమార్, వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




