Thursday, 5 November 2026

టిపిసిసి నాయకులు ముందస్తు అరెస్ట్

టిపిసిసి నాయకులు ముందస్తు అరెస్ట్*
మెట్పల్లి టౌన్, డిసెంబర్07,
జనంసాక్షి:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ జగిత్యాల జిల్లా కేంద్రం కు పర్యటిస్తున్న సందర్భంగా , టి.పి.సి.సి. నాయకులు జెడ్పీటీసీ కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, బీసీ సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్, మల్యాల మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి ధరమ్ ఆదిరెడ్డి, జిల్లా కిషన్ సెల్ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్ గౌడ్, లను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి మల్యాల పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది ఈ విధంగా కాంగ్రెస్ నాయకులకు భయపడి ముందస్తు అరెస్ట్ చేయడం చాలా దారుణమని ఈ సందర్భంగా మాట్లాడారు.