జనంసాక్షి, కమాన్ పూర్ : గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభకు గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. కమాన్పూర్ మండలం నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాల శివారులోని ప్రభుత్వ భూమిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని ఆయన ప్రారంభించారు. గత నాలుగు రోజుల క్రితం నాగారం గ్రామానికి జెడ్పీ చైర్మన్ వెళ్లన సందర్బంగా అక్కడి క్రీడాకారులు క్రీడామైదానం ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించి క్రీడా మైదానం ఏర్పాటుచేయించారు. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటైన క్రీడామైదానంలో స్థానిక క్రీడాకారులతో కాసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం అందిస్తామని, క్రీడాకారులకు తమ వంతు సహకారం ఉంటుందన్నారు. ఇప్పటికే గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేసిన బీఆర్ఎస్ప్రభుత్వం, సీఎం కేసీఆర్ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లోనిప్రతి క్రీడాకారులు క్రీడల్లో రాణించాలని, గ్రామ,మండల, జిల్లా,రాష్ట్ర స్థాయిలో రాణించాలని, ఆకాశమే హద్దుగా ఎదుగాలన్నదే తమ ఆకాంక్ష అని ఆయన అన్నారు. అడిగిన వెంటనే క్రీడా మైదానం ఏర్పాటుచేసిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ను గ్రామస్తులు, క్రీడాకారులు శాలువాతో సన్మానించ కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం అందిస్తాం – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్




