కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మే 29 :—-. జవహర్ నగర్ పరిధిలోని 226 సర్వే నెంబర్ కు చెందిన ప్రభుత్వ స్థలం వ్యవహారం పలు వివాదాలకు తావిస్తోంది గతంలో ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా గుర్తించి ఇందులో అక్రమార్కులు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు తొలగించడం జరిగింది ఈ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన ఎవరు విక్రయించిన కొనుగోలు చేసిన చట్ట ప్రకారం శిక్షార్హులు ఈ రెండు వందల ఇరవై ఆరు సర్వేనెంబర్ కి చెందిన స్థలం ప్రభుత్వ స్థలం అయినప్పటికీ ఈ స్థలాన్ని మేము కొనుగోలు చేసాము పలానా వారు విక్రయించారు అని నేరుగా ప్రభుత్వ భూములను పరిరక్షించడమే ఏకైక లక్ష్యంగా విధి నిర్వహణలో ఉన్న రెవెన్యూ అధికారుల ముందు కొనుగోలు చేసిన వ్యక్తులు బహిర్గతంగా చెబుతున్నప్పటికీ ఈ ప్రభుత్వ భూమిని పరిరక్షించెందుకోసం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం ఈ ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమార్కులు కంచే ఏర్పాటుతోపాటు అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్న విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ అట్టి నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల అక్రమార్కులను అధికారులు ప్రోత్సాహిస్తున్నారేమో అనే అనుమానాలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికైనా ఈ స్థలం కబ్జాల వ్యవహారం పైన రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రభుత్వ భూమి అక్రమార్కుల హస్తగతం కాకుండా పరిరక్షించి ఈ స్థలం కబ్జాకు పాల్పడుతున్న అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇందులో వెలిసిన అక్రమ నిర్మాణాలతో పాటు కంచెను పూర్తిస్థాయిలో తొలగించి జవహర్ నగర్ లో నివాసితులై ఉన్న రెండు లక్షల 50 వేల పైచిలుకు ప్రజల అవసరాల కోసం వినియోగించాలని ప్రజలు అభ్యర్థిస్తున్నారు




