Tuesday, 3 November 2026

ప్రజా సంఘాల నాయకుడు మట్టపల్లి సైదులుపై పోలీసుల దాడి ఖండిస్తున్న – సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు

మునగాల, మే 29(జనంసాక్షి): మునగాల మండలం కొక్కిరేణి సిపిఎం పార్టీ గ్రామ శాఖ సమావేశంలో మాట్లాడుతూ, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని, వారి పక్షాన పోరాటం చేస్తున్న సిపిఐ(యం) వ్యవసాయ కార్మిక సంఘం నాయకులపై పోలీసు దాడులు చేస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు ఆరోపించారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మోతే మండలం విభళపురం గ్రామంలో ఈనెల 26న డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలను అరికట్టాలని, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ ఇండ్లు కేటాయించాలని, ఆందోళన చేస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, సిపిఎం మండల కార్యదర్శి గోపాల్ రెడ్డిలతో పాటు నాయకుల పైన పోలీసులు మూకమ్మడిగా దాడి చేశారని, ఈ దాడిని అన్నివర్గాల ప్రజలు ఖండించాలన్నారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడైనా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ లబ్ధిదారుల ఎంపికలోరాజకీయ జోక్యం ఉండరాదన్నారు. సామరస్యంగా ఆందోళన చేస్తున్న నాయకుల పైన దాడి చేయడం హేయమైనచర్య అన్నారు. నాయకులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తు వేయాలని, అర్హులైన పేదల లిస్టు ఫైనల్ చేసి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి నందిగామ సైదులు, సీనియర్ నాయకులు పోటు పుల్లయ్య, ఉపసర్పంచ్ రావులపెంట బ్రహ్మం, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వట్టెపు చిన్న సైదులు, ములకలపల్లి సైదులు, రావులపెంట వెంకన్న, నాగరాజు, లింగయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.