అచ్చంపేట ఆర్సి 17 ఏప్రిల్ 2023 జనం సాక్షి న్యూస్ : స్థానిక అచ్చంపేట పట్టణంలోని జి ఎన్ ఆర్ అదిత్య మరియు గీతాంజలి పాఠశాల చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి ఐఐటి టాలెంట్ టెస్టులో ప్రతిభ కనబరిచి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చే ఉత్తమ అవార్డులను పొందారు . సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఆదివారం నాడు నిర్వహించిన జాతీయ మరియు,రాష్ట్ర స్థాయి ఐ ఐ టి టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచారు. సహస్ర, సాయి విశాలాక్షి ,విద్యాధరి, రాజు, తేజశ్రీ ,వరుణ్ ,ఎజ్రా శాస్త్రి లు జాతీయస్థాయి అవార్డు , కే చరణ్ రాష్ట్రస్థాయి అవార్డు పొందారు. ఇందుకు గాను గౌరవ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ చేతుల మీదుగా ఉత్తమ పాఠశాల ప్రిన్సిపల్ గా అవార్డును స్వీకరించిన హలరాజు. ఇదే క్రమంలో సర్ సివి రామన్ జీనియస్ రాష్ట్ర జిల్లా స్థాయి అవార్డు ల ను పొందిన జి ఎన్ ఆర్ ఆదిత్య మరియు గీతాంజలి స్కూల్ విద్యార్థులు. కార్యక్రమంలో సుచిర్ ఇండియా డైరెక్టర్ లయన్ డాక్టర్ వై కిరణ్ ,సినీ నటుడు అడవి శేషు ,వి6 న్యూస్ యాంకర్ చంద్రవ్వ, పాఠశాల ఇంచార్జ్ రఘునాధ శర్మ ,ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.




