Thursday, 5 November 2026

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవ సేన పై చర్యలు తీసుకోవాలి

-పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్.
గద్వాల నడిగడ్డ, జనవరి 22 (జనం సాక్షి);
ప్రజాస్వామ్య బద్దంగా దీర్ఘకాలిక భార్యాభర్తల పెండింగ్ బదిలీ సమస్య పరిష్కారంలో ప్రభుత్వ విధానాలకు నిరసనగా హైదరాబాద్ లో డైరెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులపై తెలంగాణా రాష్ట్ర విద్యా డైరెక్టర్ దేవసేన ఐ ఎ యస్ హోదాను మరిచి వ్యవహరించిన నోటి దురుసును ఖండిస్తున్నామని,బేషరతుగా టీచర్లకు క్షమాపణ చెప్పాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యులు, పాలమూరు అధ్యయన వేదిక గద్వాల జిల్లా కన్వీనర్ ఎండి ఇక్బాల్ పాషా, ధరణి హనుమంతు ఆదివారం విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు.ఏళ్ళ కేళ్ళుగా 300 కి.మీ పైగా దూర జిల్లాల్లో పిల్లాపాపలకూ, కుటుంబజీవితా లకూ దూరమై దుర్భర బాధలెదుర్కుంటున్న అంతర్ జిల్లా భార్యాభర్తలైన టీచర్ల సమస్యను
పట్టించుకోకుండా బదిలీల ప్రక్రియ చేపట్టబోతున్నామన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత చర్యతో విస్తుపోయి ఆందోళన పడ్డ ఉపాధ్యాయులు చట్టబద్ధంగా తమ నీరసన తెలుపడానికి రాజధాని కేంద్రానికి తరలివెళ్లారనీ,బాధిత టీచర్లపై రౌడీలా విరుచుకుపడి లీవ్ లు పెట్టొచ్చారా, కేసులుపెట్టించి బొక్కలో తోయిస్తా టీచర్లా రౌడీలా అంటూ అధికారహోదాను సైతం మరిచి గూండాలా విరుచుకుపడిన స్కూల్ ఎడ్యుకేష డైరెక్టర్ దేవసేన ఐ ఎ యస్ తీరుపై సమగ్ర విచారణ జరిపించి తక్షణం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.