Tuesday, 3 November 2026

గ్రామ కార్యదర్శిని నిర్బంధించిన గ్రామస్థులు

కమాన్‌పూర్‌: మండలంలోని రానాపూర్‌లో గ్రామపంచాయతీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పంచాయతీ కార్యదర్శి మారుతి, కారోబార్‌ శ్రీనివాసులను గ్రామస్థులు బుధవారం పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. గ్రామంలో తాగునీటి సమస్య, పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని తక్షణం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యదర్శిని లోపల ఉంచి తాళం వేయడంతో ఎంపీడీఓ అశోక్‌కెమార్‌ వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హీమీ ఇవ్వటంతో వారిని విడిచిపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *