మోమిన్ పేట మే 24( జనం సాక్షి)
మోమిన్ పేట మండల రైతు బంధు సమితి అధ్యక్షులుగా అబ్దుల్ అజీజ్ ను నియమించినట్లు జిల్లా బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మోమిన్ పేటకు చెందిన అబ్దుల్ అజీజ్ ను మండల రైతు బంధు సమితి అధ్యక్షులుగా రాళ్ల గుడుపల్లి రైతుబంధు సమితి అధ్యక్షులు డి లక్ష్మయ్య నియమించినట్లు ఆయన తెలిపారు రైతు సమస్యల పరిష్కారానికి రైతుబంధు రైతు బీమా వంటి పథకాలు అర్హులైన రైతులకు అందే విధంగా రైతు బంధు సమితి అధ్యక్షులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు అధ్యక్షుడు రామ్ రెడ్డి మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పటేల్ శ్రీకాంత్ గౌడ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు గ్రహీత నర్సింహారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు డి వెంకట్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు హరి శంకర్ మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ఏ ప్రభాకర్ డి లక్ష్మయ్య కాశీరాం రవీందర్ నాయక్ మహబూబ్ అలీ ఖాలేద్ మండలంలోని సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
మోమిన్ పేట మండల రైతు బంధు సమితి అధ్యక్షులుగా అబ్దుల్ అజీజ్ నియామకం




