Thursday, 5 November 2026

గ్రామ పంచాయతీలో సీమంతం

గ్రామ పంచాయతీలో సీమంతం
జుక్కల్, నవంబర్25,( జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలములోని లొంగన్ గ్రామ పంచాయితీలో శుక్రవారం గర్భిణికి సేమంతం వేడుక నిర్వహించారు. గర్భిణికి ఒడిబియ్యం పోసి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ నాగల్ గిద్దే ఉషారాణి సదాశివ్
మాట్లాడుతు తెలంగాణా ప్రభుత్వం మాతా శిశు సంరక్షణ లో భాగంగా సామూహిక సీమంతం కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోందని తెలిపారు. ప్రభుత్వం సర్కారు దవాఖానలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసిందని తెలిపారు.సర్కారు దవాఖానలో నే సహజ ప్రసవాలు జరిగే విధంగా ఆరోగ్య సిబ్బంది కృషిచేస్తోందని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. పుష్టికరమైన ఆహారం భుజించాలని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్ల సలహాలు పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అనురాధ, అంగన్వాడి టీచర్ అనిత,స్కూల్ టీచర్ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.