:శామీర్ పేట్, జనం సాక్షి :కార్మికుల మౌళిక వసతుల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి శివ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లాలోని మండలాల గ్రామ పంచాయతీలకు వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్బంగా మాట్లాడు తూ..ప్రతీ వర్కర్స్ కు ఇన్సూరెన్స్ రూ.5 లక్షలు అమలుచేసి ప్రమాద బీమాగా 10 లక్షలు ఇవ్వాలన్నారు.దహన సంస్కారాలకు 30 వేలు ఇవ్వాలి.వయస్సు మీరిందనే సాకుతో కార్మికులను మారిస్తే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఏడాదికి 3 జతల యూనిఫాం, చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వాలి, వాటికి నగదు రూపంలో
అలవెన్సులు చెల్లించాలన్నారు.సిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. 8 గంటల పనిదినాన్ని అమలుచేయ్యాలని ఆదివారం, పండుగ సెలవులు, జాతీయ, అంతర్జాతీయ సెలవు దినాలను అమలుచేయాలని పేర్కొన్నారు.కార్మికులపై రాజకీయ నాయకుల వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలి. కార్మికులకు సంబంధించిన.. ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల జోక్యాన్ని అరికట్టాలి. అలా జోక్యం చేసుకున్న వారిపై చట్ట రీత్య చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో
తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయితీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శివ బాబు, శామీర్ పేట్ మండల అధ్యక్షులు సురేష్, కోశాధికారి స్వామి,తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ కార్మికుల గోస పట్టదా!: శివ బాబు




