నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జైపూర్ ఏసీపీ నరేందర్ తెలిపారు. రామగుండం సీపీ మేడమ్ ఆదేశాల మేరకు డీసీపీ మంచిర్యాల సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్. ఉత్తర్వుల ప్రకారం, జైపూర్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో సీఐ విద్యాసాగర్, ఎస్ఐ వెంకట్ కోటపల్లి మండలంలోని అన్నారం గ్రామం లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందసరైన పత్రాలు లేనటువంటి 70 బైకులు 12 ఆటోలు 03 టాటా ఏసఇ ఆటో లు, 02 బొలెరో వాహనాలు సిజ్ చేయడం జరిగిందిఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. పోలీసులు ఉన్నది ప్రజల రక్షణకే నని, ప్రజలకు పోలీసులు భద్రత, భరోసా కల్పించ డానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తు లు అనుమానాస్పదంగా కనిపిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చాలామంది యువకులు ఆన్లైన్ మోసాలకు బలవుతున్నారని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని యువ తకు అవగాహన కల్పించారు. యువత చెడు అల వాట్లకు దూరంగా ఉంటూ, గ్రామాభివృద్ధికి పాటు పడాలని కోరారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా 100కు ఫోన్ చేయాలని సూచించారు. వాహ నాలు నడిపేటప్పుడు సరైన ధ్రువపత్రాలతో పాటు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాల న్నారు. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని వ్యాపార సముదాయాల వద్ద, చౌరస్తా ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. యువత గుట్కా, జూదం, నాటుసారా, గంజాయి లాంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఒకసారి పోలీసు కేసు నమోదు అయితే ప్రైవేట్ జాబ్ కూడా రాలేని పరిస్థితి ఉంటుందన్నారు.
కార్యక్రమంలో చెన్నూర్ రూరల్ సీఐ విద్యా సాగర్, కోటపల్లి ఎస్ఐ వెంకట్, నీల్వాయి ఎస్ఐ సుబ్బారావు, టిఎస్ఎస్పీ సిబ్బంది, 50 మంది పోలీసులు పాల్గొన్నారు.




