జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె శిభిరాన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. జ్యోతి సందర్శించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ పంచాయతి కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని గోంతెమ్మ కోరికలు కోరడం లేదని వారి డిమాండ్లు ముమ్మాటికీ న్యాయపరమైనవి అని అన్నారు.ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులతో పని చేసుకుంటూ… పల్లె ప్రగతిలో మరియు హరిత హారంలో అవార్డు లు తీసుకోని కార్మికులను విస్మరించడం బాధాకరం అని అన్నారు. కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రెంట్ లైన్ వర్కర్స్ గా సేవలు అందించిన కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవాలని అన్నారు. రాష్ట ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మెను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్,కారోబార్ల సంఘము జిల్లా అధ్యక్షులు కాసిపేట అశోక్, నాయకులు ఆర్ల సందీప్,గొర్రెంకెలా సురేష్, కారోబార్ లు,బిల్ కలెక్టర్ లు,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెను ఉదృతం చేస్తాం – జిల్లా సీఐటీయూ సహాయ కార్యదర్శి జ్యోతి




