వేములవాడ రూరల్, జూలై 7 (జనం సాక్షి) : చిన్నప్పటి నుంచి సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన పెంపొందించుకుంటే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని కృష్ణవేణి పాఠశాల కరస్పాండెంట్ సన్నిధి వెంకట కృష్ణ పేర్కొన్నారు. వేములవాడ నంది కమాన్ కృష్ణవేణి పాఠశాలలో శుక్రవారం చిన్నారులు అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాల పండగ నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారు, పోతరాజు వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి, ఉపాధ్యాయులు రాజు,అనీల్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
బోనమెత్తిన చిన్నారులు




