Wednesday, 4 November 2026

గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్, ఎమ్ఎల్ ప్రజా పంధా నాయకులు-పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలి జీవో నెంబర్ 60 ప్రకారం జీతాలు చెల్లించాలి.


అశ్వారావుపేట, జులై 8(జనంసాక్షి )

అశ్వారావుపేట మండల కేంద్రంలో గత మూడు రోజుల నుండి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తగా పంచాయతీ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలోతమ విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొగలపు చెన్నకేశవరావు పాల్గొని సంఘీభావం తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీలో గత 35 సంవత్సరాల నుండి పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని జీవో నెంబర్ 60 ప్రకారం పంచాయతీ పేపర్లకు 15600 చెల్లించాలని మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారికి వేతనాలు చెల్లించాలని కారోబార్ బిల్ కలెక్టర్ లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని ప్రమాదం జరిగి మరణించిన కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని పిఎఫ్ . ఈ ఎస్ ఐ ప్రమాద బీమా గ్రాంట్ టీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపందా జిల్లా నాయకులు గోకినేపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ వారి న్యాయమైన డిమాండ్లను జీవో నెంబర్ 60 ప్రకారం స్వీపర్లకు 15600/- పంపు ఆపరేటర్లకు ఎలక్ట్రిషన్ కు, బిల్ కలెక్టర్లకు 19,500/- నిర్ణయించాలన్నారు. అలానే గ్రామపంచాయతీలో ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్లకు గ్రామపంచాయతీ ద్వారా లైసెన్సులు ఇవ్వాలి డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు దంజు నాయక్ చల్లా రమాదేవి మద్దు మరియమ్మ కృష్ణకుమారి మందపాటి వెంకన్నబాబు సిపిఐ ఎంఎల్ ప్రజాపందా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు గోగినేపల్లి ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ టి పి సి సి నెంబర్ ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మ రాంబాబు సత్య వరపు బాలయ్య వేముల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు