గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెకు మండల కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు.
వీణవంక జూలై 11 (జనం సాక్షి ) వీణవంక మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్. గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెను ఉద్దేశించి ఎండీ సాహెబ్ హుస్సేన్. మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల వేతనాల పెంపు మరియు పర్మినెంట్ కోసం నేటికీ ఆరు రోజులు గడుస్తున్నా కానీ. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం సోచనియం అన్నారు. వీణవంక మండలంలోని 26 గ్రామా పంచాయతీ కార్మికులు వారి హక్కులకు సమ్మె చేస్తున్నారు. పారిశుధ్యం పనులు పక్కుకు పోయేస్తితికి ప్రభుత్వం తీసుకు వచ్చింది.కార్మికులు అనేక సంవత్సరాల తరబడి పోరాడుతున్నప్పటికీ న్యాయం చేయలేదు.ఈ సమ్మె డిమాండ్స్ పరిష్కరించాలి.ఉద్యోగ భద్రత లేకుండా,వేతనాలు ప్రతి నెల చెల్లించకుండా, రెండు మూడు నెలలు పెండింగ్ పెడుతూ ఒకపక్క మండల అధికారులు, గ్రామ సర్పంచులు,కార్యదర్శుల వేధింపులు ఎక్కువవుతున్నాయని జీతాలు ఇవ్వాలని అడిగిన కార్మికులను పనులను తొలగిస్తున్నారని,కార్మికుల ఉద్యోగ భద్రత, జీవో నెంబర్ 60 ప్రకారం 30% పిఆర్సి పేంపు అమలు చేయాలని, పీఎఫ్ ఇఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రమాదవశాస్తు మరణించిన కార్మికుల కుటుంబానికి 5 లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం, పారిశుద్ధ్య కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ అందించాలని,మల్టీపర్పస్ 51 జీవోను సవరించి, కేటగిర్ల వారిగనే పనులు కొనసాగించాలని, కారోబార్లను పంచాయతీ సహాయ కార్యదర్శి లుగా నియమించాలని తదితర డిమాండ్ల లో సాధన కోసం నిరవధిక సమ్మెలోకి వెళ్లారు అని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిచి పరిష్కారం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, నాయకులు గంగాడి రాజిరెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్ ఎండీ రజాక్, పల్లె అంజిరెడ్డి గ్రామపంచాయతీ కార్మికులు మహంకాళి కొమురయ్య, కండే సదయ్య, దసారపు వెంకటేష్, కిషన్ రావు, గోడిసేలా కొమురయ్య, దసారపు మల్లయ్య, శంకర్ వీరితోపాటు గ్రామాల కార్మికులు తోపాటు తదితరులు పాల్గొన్నారు.