సంకల్ప రధయాత్ర కు టి ఎస్ టి టి ఎఫ్ జిల్లా శాఖ మద్దతు

టేకులపల్లి, జూలై 11( జనం సాక్షి): పాత పెన్షన్ సాధన కోసం చేపట్టిన సంకల్ప రథయాత్రకు టీఎస్ టిటిఎఫ్ జిల్లా శాఖ పూర్తి మద్దతునిస్తుందని జిల్లా కమిటీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి భూక్య శంకర్ నాయక్, వాంకుడు రమేష్ బాబు అన్నారు. సిపిఎస్ విధానం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సుమారు 30 సంవత్సరాల నుండి ప్రభుత్వ విధులు నిర్వహించే ఉద్యోగికి, పదవీవిరమణ అనంతరం భద్రత లేని పెన్షన్ అనగా కనీస భద్రత లేని భవిష్యత్తు ఉండడడం శోచనీయం. అందుకే సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ ను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల (జులై )16 నుండి సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు తలపెట్టిన “సంకల్ప రథాయాత్ర “కు టి ఎస్ టి టి ఎఫ్ భద్రాద్రి జిల్లా శాఖ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. తెలంగాణ లోని 33 జిల్లాలలో సాగె ఈ “సంకల్ప రథాయాత్ర ” ఈ నెల 19న కొత్తగూడెం జిల్లా కేంద్రం లో కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నందున ఉద్యోగ, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని, ఈ యాత్ర ను విజయవంతం చేయవలసినదిగా కోరారు.

 

తాజావార్తలు