గ్రామ పంచాయతీ వర్కర్స్ మోకాళ్ళపై,అర్ధనగ్నంగా నిరసన….
నాగర్ కర్నూల్ ఆర్సీ జూలై 12(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె కొనసాగించడం జరుగుతుంది.అందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన మోకాళ్ళ మీద నిరసన చేయడం జరిగింది.ఇందులో పాల్గొన్న వ్యక్తులు గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాగర్కర్నూల్ మండల అధ్యక్షులు కుసునూరు.రామకృష్ణ ఉపాధ్యక్షులు బుషిపగ.రాము వర్కింగ్ ప్రెసిడెంట్ కాసిం అదేవిధంగా కురుమయ్య, వెంకరెడ్డి, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.