గ్రామ పంచాయితీ కార్మికుల న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి బీఎస్పీ ములుగు ఇంచార్జి గడ్డం భిక్షపతి గౌడ్

ఏటూరునాగారం(జనంసాక్షి)జులై11.
ఈ రోజు ఏటూరునాగారం మండల కేంద్రం లోని 12గ్రామపంచాయతీ ల గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బంది, కార్మికుల జె ఏ సి రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె 6వ రోజు సమ్మెకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ ఏటూరునాగారం మండలం అధ్యక్షులు ఎంపెల్లి రాజు ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా బీఎస్పీ ములుగు అసెంబ్లీ ఇంచార్జి గడం బిక్షపతి గౌడ్ మరియు బీఎస్పీ ములుగు అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎంపెల్లి వీరాస్వామి హాజరైనారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి
బీఎస్పీ ములుగు అసెంబ్లీ ఇంచార్జి గడం బిక్షపతి గౌడ్ గారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు జీతాలు పెంచడంతోపాటు పర్మనెంట్ ఉద్యోగ భద్రత కల్పించాలని విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఆరోగ్యపరమైన హెల్త్ కార్డు ఈఎస్ఐ కార్డును మరియు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉచితంగా అందాలని కోరడం జరిగింది ఎవరైనా కార్మికులు చనిపోయిన కుటుంబానికి 10 లక్షల ఎక్స్ క్రియేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఎస్పీ ములుగు అసెంబ్లీ ప్రెసిడెంట్ ఎంపెల్లి వీరాస్వామి మాట్లాడుతూ పనికి తగిన వేతనం ఇవ్వాలని ప్రతి కార్మికుడికి 8 గంటలు పని చేసే విధంగా ఉండాలని
బహుజన సమాజ్ పార్టీ ద్వారానే మన బడుగు బలహీన వర్గాలమైన అందరికీ న్యాయం జరుగుతుందని రాబోయే రోజులలో ఏనుగు గుర్తుకే ఓటు వేసుకొని మన ప్రియతమ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను,ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు సంపత్,జిపి కార్మికుల ఏటూరునాగారం మండల అధ్యక్షులు ఇర్సవడ్ల రాజు,గ్రామ పంచాయితీ సిబ్బంది, మహిళలు, కార్మికులు తదితరులు పాల్గొనడం జరిగింది.

తాజావార్తలు