Thursday, 5 November 2026

గ్రామ పంచాయితీ కార్యదర్శిని హతమార్చిన మావోయిస్టులు

కరీంనగర్‌, నవంబర్‌ 9 : జిల్లాకు చెందిన మహదేవ్‌పూర్‌ మండలంలోని కంకణపల్లి గ్రామ పంచాయితీ కార్యదర్శి రాఘవయ్యను మావోయిస్టులు గురువారం రాత్రి కాల్చి చంపారు. మహదేవ్‌పురం ఆటవీ ప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న వివరాలను, కంకణపల్లి పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నారన్న సమాచారం మావోయిస్టులకు అందడంతో వారు రాఘవయ్యను కాల్చి చంపివేసినట్లు సమాచారం. మావోయిస్టులు పోత పోతు రాఘవయ్య శవం వద్ద కాగితాన్ని వదిలివేశారు. తమ సమాచారాన్ని పోలీసులకు ఎప్పటికప్పుడు అందిస్తుండడంతో రాఘవయ్యను హతమార్చామని అందులో రాసివుంది. ఈ సంఘటన జరగడంతో ఆ ప్రాంత వాసుల్లో భయభ్రాంతులు నెలకొన్నాయి. గ్రామాల నుంచి ప్రజలు ఎవ్వరూ రాత్రి వేళ్లలో వచ్చేందుకు జంకుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *