Thursday, 5 November 2026

35వ సబ్‌ జూనియర్‌ జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు

కరీంనగర్‌, నవంబర్‌ 9 : జిల్లాలోని రామడుగు మండలం వెదిర గ్రామంలో జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 25వరకు 35వ సబ్‌ జూనియర్‌ జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఛాంపియన్‌ షిప్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ అధ్యక్షుడు జోజిరెడ్డి సంయుక్తంగా తెలిపారు. రామడుగు మండలం వెదిరలోని యన్‌.వి. మాతా ఇంగ్లీషు మీడియం హైస్కూల్‌ మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ఛాంపియన్‌ షిప్‌ అండ్‌ 19 విభాగంలో బాల బాలికలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 25రాష్ట్రాల నుండి 49 టీంలు ఈ ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. 25బాలుర బృందాలు, 24 బాలికల టీంలు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలో మొట్టమొదటి సారిగా జిల్లా యంత్రాంగం సహకారంతో అండర్‌ 19 విభాగంలో 35న సబ్‌ జూనియర్‌ జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *