భువనగిరి టౌన్ జనం సాక్షి:–అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన తాజ్పూర్ గ్రామానికి చెందిన పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) భువనగిరి మండలం తాజ్పుర్ గ్రామంలో సర్పంచ్ బొమ్మరపు సురేశ్, బీఅర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్ అధ్వర్యంలో తాజ్పూర్ బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. జరిగిన కార్యక్రమంలో పల్లేపాటి భాగ్య కి రూ 26,500, ఓరుగంటి రాజు కుమారునికి 52,000 రూపాయల చెక్కులను బుధవారం అందచేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. బాధిత కుటుంబాలు సీఎం కేసీఆర్ కి మరియు భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు నంబర్ పల్లేపాటి రామస్వామి, సొమ్న్న నగేష్,పండుగ కిరణ్, పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు ఓరుగంటి రమేష్, కోట గోవర్ధన్, ఎస్ కే యాకూబ్, ఎస్కే హైమద్, రాంపల్లి మల్లేష్, ఉడుత రాజు, వరిగంటి హరికృష్ణ, ర్యాకల నరసింహ, బొమ్మరపు ఉమేష్ ఓరుగంటి విట్టల్, బిట్కూరి బాలరాజ్, బిట్కూరి మహేష్, పల్లెకాడి చంద్ర నరసింహ, గుండె శివ, పల్లెపాటి ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.




