భువనగిరి టౌన్ జనం సాక్షివై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వై ఎస్ షర్మిల పిలుపు మెరకు రాష్ట్ర వ్యాప్తంగా టీ – సేవ్ కార్యక్రమం లో భాగం గా యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత అధికారి ఏఒ నాగేశ్వర చారీ కి వై.యస్.ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు అతహర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా అతహర్ మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన ఉద్యమం చేస్తామని అన్నారు.నిరుద్యోగులకు ప్రతి నెల 3016/-నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఎస్పిఎస్సి పేపర్ లీకేజీ వ్యవహారముపై సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు.విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో ఆలేరు అసెంబ్లీ కోఆర్డినేటర్ గ్యార నరేష్, భువనగిరి పట్టణ అధ్యక్షులు సాయి నివాస్, యూత్ కార్యదర్శి రాకేష్, యాత్ నాయకులు ముజాహిద్, జకీ, వసీమ్ తధితరులు పాల్గొన్నారు.




