Thursday, 5 November 2026

తెలంగాణ బీసీ సంరక్షణ సమితి సంయుక్త సమావేశం

.

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–తెలంగాణ బీసీ పరిరక్షణ సమితి ప్రారంభ సమావేశం భువనగిరిలోని ఎస్ వి హోటల్లో బుధవారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్టిఐ సమాచార హక్కు చట్టం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దేవులపల్లి శేషగిరి రావు హాజరై మాట్లాడారు బీసీ వర్గాలకు చట్టసభలలో రిజర్వేషన్ల ప్రకారం వివిధ రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు త్వరలో జరగబోయే యుద్ధంలో రెండే రెండు కులాలు ముఖ్యంగా ఉంటాయని అవి స్త్రీ పురుషులు అని అన్నారు సవీరంగా తెలియజేస్తూ చట్టసభలు బీసీలకు వాటర్ కేటాయించినప్పటికీ దాని సరైన రీతిలో అమలుపరచడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు గ్రామాలలో స్థానిక ఎన్నికలకు మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తూ మహా అయితే జడ్పీటీసీ లను ఎంపీటీసీ లకు వరకే పరిమితం చేస్తున్నారని అన్నారు మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిమితం చేస్తూ స్థానిక అసెంబ్లీ పార్లమెంట్ సభలకు చట్టం ప్రకారం వచ్చిన బీసీలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ నాయకులు ముఖ్యంగా అడ్వకేట్లు న్యాయం జరగాలని వారు కూడా సభను ఉద్దేశించి మాట్లాడారు అలాగే బీసీ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది శ్రీ భీమ గాని హరిబాబు గారు మాట్లాడుతూ బీసీల విషయంలో అనేక రకాల గురించి చెప్పడం జరిగింది న్యాయస్థానంలో తాము పనిచేస్తున్నప్పటికీ 60 శాతం ఉన్న బీసీలను వివిధ రాజకీయ పార్టీల నాయకులు అవకాశం కల్పించకపోవడం శోభనీయమని భీమ గాని హరిబాబు  అన్నారు అలాగే సభాధ్యక్షులు శ్రీ చిందం కృష్ణ  మాట్లాడుతూ బీసీ పరిరక్షణ సమితిని సుభిక్షమైన కార్యకర్తలను తయారుచేసి రాష్ట్రంలో బీసీలందరినీ ఏకం చేయడానికి వేదిక పైనుండి.            బీసీలను ఏకతాటిపై కలిసి రావాలని ఒకటే మార్గం అలాగే సభను ఉద్దేశించి సీనియర్ జర్నలిస్టులు పలువురు మాట్లాడుతూ బీసీల ఐక్యవర్గం కొరకు పోరాడాలని సూచించారు బీసీ పరిరక్షణ సమితి కార్యక్రమాలకు తమ మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీసీ పరిరక్షణ సమితి కార్యదర్శి సామల సిద్ధులు కోశాధికారి బందారపు మధు న్యాయవాదులు భీమ గాని శ్రీనివాస్ కెవిపి ప్రసాద్, వంగరి శివకుమార్  ఎడమ ప్రవిన్ చిరంజీవి తండా నవీన్ నల్గొండ నుండి వచ్చిన బీసీ నాయకులు ఎం ప్రభాకర్ వెంకటేశ్వర్లు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..