Wednesday, 4 November 2026

గ్రీన్ వుడ్ కృష్ణవేణి పాఠశాల ఉపాధ్యాయులకు రంజాన్ తోఫా అందజేత

 

 

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 20 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని గ్రీన్ వుడ్, కృష్ణవేణి పాఠశాలలో ముస్లిం ఉపాధ్యాయులకు గురువారం చైర్మన్ సరితమరెడ్డి రంజాన్ తోఫాను అందజేశారు. ఈ సందర్భంగా సరితామరెడ్డి మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్షలను ముస్లిం సోదర సోదరీమణులు క్రమశిక్షణతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. అల్లా దయతో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఏవి కృష్ణారావు, గ్రీన్ వుడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజారెడ్డి, దిల్షాద్, నజిమా, రెహమత్, అమినా, సనా, ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.