Wednesday, 4 November 2026

హాత్ సే హాత్ జోడో యాత్రకు విశేష స్పందన.

 

 

 

 

 

మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్ 20అధికార పార్టీ నాయకులకు ఊడిగం చేసే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ ఆరోపించారు.
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా గురువారం గౌతమ్ నగర్ డివిజన్ లోని సత్యనారాయణ కేఫ్,మిర్జాల్ గూడ, పవన్ మోటార్స్ ప్రాంతాలలో గడప గడప తిరిగి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విలేకరుల సమావేశంలో
ఆయన మాట్లాడుతూ.హాథ్ సే హాత్
జోడో యాత్రకు ప్రజల నుంచి విశేషస్పందన వస్తుందని అన్నారు.
గౌతం నగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ ప్రజా సమస్యలను పట్టించు కోవడం లేదని ఓపెన్ నాళాలు,బాక్స్ డ్రైనేజీ పనులు ప్రణాళికలు లేకుండా రూపొందిస్తున్న  రని ఎగువ నుంచి వచ్చే వర్షపు నీరు పవన్ మోటార్స్ ప్రాంతాలలో నిలిచే అవకాశం ఉందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తె ఐదు వందలకు గ్యాస్ సిలిండర్,ప్రతి ఇంటిలో అర్హులైన వారికి పింక్షన్లు,రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు.
ఈకార్యక్రమంలో బిబ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్,జీవన్ రెడ్డి,ప్రవీణ్,యాదగిరి,మోహన్ యాదవ్,భరత్,షేక్,సాయి,  దశరథ్,పూస శేఖర్,రామ్,శ్రీనివాస్, సతీష్,పోల్కం వెంకటేష్,లింగారెడ్డి, సిరిగిరి నర్సింగరావు,జీడి సత్యనారాయణ గౌడ్,జీడి శ్రీనివాస్ గౌడ్,గుత్తి రామచందర్,శ్రీనివాస్ గౌడ్, ఉమేష్ సింగ్,వినోద్ యాదవ్,సానాది శంకర్,సూర్య ప్రకాష్,రెబ్బ వాసు, రాములు గౌడ్,మహేందర్ గౌడ్,విట్టల్,  రాజేష్ గౌడ్,శ్యామ్ రావు,బుచ్చిబాబు, వేణు,సాయికుమార్,దుర్గా సాయి, అశోక్ రెడ్డి,చంద్రశేఖర్,సిఎల్ యాదగిరి, పవన్,సంతోష్ యాదవ్,ప్రవీణ్,ఆశ, మాధవి,ప్రభ తదితరులు పాల్గొన్నారు.