Wednesday, 4 November 2026

సిపిఐ ప్రజాగర్జన సభను జయప్రదం చేయండి.

పెనుబల్లి, జూన్ 6(జనం సాక్షి)భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈనెల 11వ తేదీన కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ప్రజా గర్జన సభను జయప్రదం చేయాలని సిపిఐ పెనుబల్లి మండల కార్యదర్శి కొమ్మినేని సుధాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు, పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాగర్జన సభ జరుపుతున్నామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, పోడు భూములకు పట్టాలు, వృద్ధాప్య వితంతు పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రైతులకు రుణమాఫీలు, రైతులకు వడ్డీ లేని రుణాలు, నష్టపోయిన పంటకు పరిహారం, ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలకు పట్టాలు, వంటి సమస్యల పైన సిపిఐ ప్రజాగర్జన సభను లక్షలాది మందితో జరపడానికి నిర్ణయించిందని సుధాకర్ తెలిపారు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఏ ప్రభుత్వం పైనైనా పోరాడుతూనే ఉంటుందని అంతిమంగా ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేస్తుందని తెలిపారు ,ఈ నేపథ్యంలో ప్రజా గర్జన సభ విజయవంతం చేసేందుకు ప్రజలు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో జూన్ 11వ తేదీన కొత్తగూడెం తరలివెళ్లి జయప్రదం చేయాలని కోరారు.