Tuesday, 3 November 2026

గ్రేటర్‌లో ఇన్‌ఛార్జీల నియామకం

హైదరాబాద్‌,ఫిబ్రవరి5 (జనంసాక్షి):
త్వరలో జరగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధమవుతోంది. ఈ కార్యాచరణలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గ్రేటర్‌ నియోజకవర్గాలకు ఇన్‌ చార్జ్‌ లను నియమించారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీని మలక్‌ పేట, యాకుత్పురా, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, బహుదుర్‌ పురా, నాంపల్లి లకు, ¬ంమంత్రి నాయిని నరసింహారెడ్డిని  ముషీరాబాద్‌, అంబర్‌ పేట, గోషామహల్‌, ఎల్బీనగర్‌, ఖైరతాబాద్లకు, పద్మారావును సికింద్రాబాద్‌, కంట్మోన్మెంట్‌, మల్కాజ్‌ గిరి, ఉప్పల్‌ లకు, రవాణాశాఖ మంత్రి మహేందర్‌ రెడ్డిని మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, కార్వాన్‌, పటాన్‌ చెరు లకు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ను సనత్‌ నగర్‌, కూకట్‌ పల్లి, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌ లకు ఇంఛార్జ్‌ లుగా నియమిం చారు.  తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ నాయకుల సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో సాగింది. సమావేశంలో పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ నాయకులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కే కేశవరావుతోపాటు డిఫ్యూటీ సీఎం మహమూద్‌ అలీ,మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ లో పార్టీ సభ్యత్వ నమోదు దిశగా నేతలు సమావేశమైన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *