– విపక్షాలను ఊడ్చిపారేసిన టీఆర్‌ఎస్
– దుమ్ములేపిన కారు
-వాడిన కమలం
– సైకిల్ టైరు పగిలింది.. పంక్చరైంది
– పట్టు నిలుపుకున్న ఎంఐఎం
హైదరాబాద్,ఫిబ్రవరి 5(జనంసాక్షి): హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేస్తామన్న సిఎం కెసిఆర్‌కు నగర ప్రజలు భారీగా మద్దతు పలికారు. విశ్వవిజేతగా నిలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా చేయండంటూ ఆశీర్వదించారు. హైదరాబాద్ మురికిని పారదోలండంటూ ప్రతిపక్షాలను కడిగి పారేశారు. హుస్సేన్ సాగర్ కంపును తొలగించండంటూ గట్టిగా చెప్పారు. అంతేగాదు విూరు హైదరాబాద్ అభివృద్దికి కట్టుకున్న కంకణం మేరకు నడవండంటూ దీవించారు. విూ వెనక మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. ఊహించని విధంగా
హైదరాబాద్ చరిత్రలో తొలిసారిగా గ్రేటర్ ఎన్నిక్లలో గులాబీ బాస్‌కు భారీ మెజార్టీ కట్టబెట్టారు. ఫలితాల తీరును బట్టి గెలుస్తామన్న విధంగా వంద సీట్లలో దూసుకుని పోయింది. ఇక్కడ అక్కడా అన్న తేడా లేకుండా నగరమంతా గులాబీ గుబాళించింది. టిఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని నిరూపించింది. దీంతో ఎవరి మద్దతు లేకుండా ఎవరిపైనా ఆధారపడకుండా మేయర్ పీఠం దక్కించుకునే అరుదైన అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. ప్రధనా ప్రతిపక్షంగా ఇక ఎంఐఎం ఉండబోతోంది. మొన్న వరంగల్ ఉప ఎన్నిక, తరవాత ఎమ్మెల్సీఎన్నికలు, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల ఫలితాల తీరు నిజంగానే టిఆర్‌ఎస్‌ను తిరుగులేని రాజకీయ శక్తిగా నిలిపాయని భావించాల్సిందే. వందసీట్లు గెలుస్తాం..లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి కెటిఆర్ సవాల్ నిజమైందేనని నిరూపించారు. హైదరాబాద్ చరిత్రలో కొత్త రికార్డు.. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల హిస్టరీలోనే ఎన్నడూ కనీ వినీ ఎరుగని ఫలితాలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మునుపెన్నడూ లేని విధంగా గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వంద డివిజన్లకు పైగా కైవసం చేసుకుని తెలంగాణలో సరికొత్త విప్లవం సృష్టించింది. ఎంఐఎం తప్ప ప్రత్యర్థి పార్టీలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. ఎంఐఎం పార్టీ సైతం పోటీ చేసిన స్థానాల్లో కొన్నింట మాత్రమే గెలుపు దిశగా పయనిస్తోంది. కౌంటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఊహించినదానికంటే భారీ స్థానాల్లో టీఆర్‌ఎస్ ముందంజలో దూసుకుపోతోంది. కారు దూకుడు చూస్తుంటే 100 స్థానాలకు పైగానే గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనధికారికంగా 70కి పైగా స్థానాల్లో కారు గెలుపొందగా 30 స్థానాలకు పైగా లీడింగ్‌లో ఉంది. తెలంగాణ భవన్‌లో ఆల్‌రెడీ సంబురాల మోత మోగుతోంది. వేలాది మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు భవన్‌కు తరలి వస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ తెరాస జోరు విూద ఉందన్నది నిరూపితమయ్యింది. ఇప్పటివరకు విడుదలైన ఫలితాల్లో తెరాస అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. మరో 34 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ విజయ ఢంకా మోగించడంతో గ్రేటర్‌పై గులాబీ గుబాళించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగితేలుతున్నారు. తెలంగాణ భవన్‌కు అత్యధిక సంఖ్యలో చేరుకున్న టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ.. బాణాసంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో ఆ పార్టీ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఎంఐఎం 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
నాన్నకు ప్రమతో ఈ విజయం
గ్రేటర్‌పై గులాబీ గుబాళించింది. మంత్రి కేటీఆర్ కఠోర శ్రమకు ఫలితం దక్కింది. ఈ విజయాన్ని నాన్నకు ప్రేమతో అన్న చందంగా గ్రేటర్ ప్రజలు సీఎం కేసీఆర్‌కు పట్టం కట్టబెట్టారు. 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. నాలుగు జోన్లలో విపక్షాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. కారు దూకుడుకు విపక్షాలు దిగాలయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సింగిల్ డిజిట్‌కు మాత్రమే పరిమితమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు పత్తాలేకుండా పోయాయి. ఎంఐఎం 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మాదాపూర్, జియగూడ, వెంకటాపురం, చింతల్, వనస్థలిపురం, అడిక్‌మెట్, గోల్నాక, గాజులరామారం, సోమాజిగూడ, రాంనగర్, బోరబండ, రంగారెడ్డిగూడ, అల్వాల్, ఖైరతాబాద్, మచ్చబొల్లారం, బేగంపేట్, మోండా మార్కెట్, కొండాపూర్, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్‌మండి, రామంతాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ గెలుపొందింది.
ఫలించిన టిఆర్‌ఎస్ ప్రచార వ్యూహం
చార్ సౌ షహర్.. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరంపై టీఆర్‌ఎస్ తన పట్టు నిరూపించుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జీహెచ్‌ఎంసీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఓ రకంగా టిఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా ప్రచారం చేసి ప్రజల్లో విశ్వాసం కల్పించింది. అత్యధిక స్థానాలు గెలుచుకుని తానేంటో చూపించింది. కోర్‌సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం సీఎం కేసీఆర్ ముందు నుంచి రచించిన వ్యూహంతో పాటు.. ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్ ఉధృతంగా సాగించిన ప్రచారం కూడా టీఆర్‌ఎస్ విజయానికి కారణమైంది. ‘గాడిదకు గడ్డి వేసి ఆవును పాలివ్వమంటే ఇస్తుందా.. అభివృద్ధి కావాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించండి విశ్వనగరంగా అభివృద్ది చేసుకుందాం…ప్రపంచపటంలో ముందుచుతాం అన్న మాటలు కూడా ఓటర్ల విూద గట్టిగానే పనిచేసినట్లు కనిపిస్తోంది. సెటిలర్లు, ఆంధ్రప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండే శివారు ప్రాంతాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం ఇందుకు నిదర్శనం. ఇప్పటివరకు గ్రావిూణ ప్రాంతాలతో పాటు, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన వరంగల్, నల్లగొండ, కరీంనగర్ లాంటి జిల్లాల్లో తప్ప హైదరాబాద్ నగరంలోని ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌కు అంతగా పట్టు లేదనే అపప్రథ ఉండేది. అందుకే సనత్‌నగర్ ఉప ఎన్నిక విషయంలో కూడా వెనకడుగు వేస్తూ.. తలసాని శ్రీనివాస యాదవ్‌ను మంత్రిగా కొనసాగించడంపై విమర్శలు కూడా వచ్చాయి. వాటన్నింటికీ సమాధానంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలను చూపించాలని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీఆర్‌కు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు. అందుకు తగ్గట్లే కేటీఆర్ కూడా.. దాదాపు నగరంలోని అన్ని మూలలకూ సుడిగాలి పర్యటనలు చేసి, సెటిలర్ల ఓట్లను కూడా రాబట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇంతకుముందు జరిగిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని మరిచిపోయే రేంజిలో ఫలితాలు రాబట్టేందుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఆ పర్యటనలు తగిన ఫలితాలను రాబట్టాయి. కేవలం కోర్‌సిటీలో మాత్రమే కాక.. శివారు ప్రాంతాల్లో సైతం తన పట్టు నిలబెట్టుకునేందుకు టీఆర్‌ఎస్ ఈ ఎన్నికలను సమర్థంగా ఉపయోగించుకోగలిగింది. కోర్ సిటీ మాట ఎలా ఉన్నా, శివారు ప్రాంతాలు.. అంటే సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సెటిలర్లు ఎక్కువగా
ఉంటారని, వాళ్ల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌కు రావు కాబట్టి వాటిని కొల్లగొట్టగలిగితే అధికార పార్టీ ఆధిక్యాన్ని గణనీయంగా తగ్గించొచ్చని కాంగ్రెస్‌తో పాటు టీడీపీ-బీజేపీ కూడా భావించాయి. కానీ అలా జరగలేదు. దాంతో ఆ పార్టీల ఆశలు గల్లంతయ్యాయి.
ప్రముఖులకు, వారసులకు చుక్కెదురు
గ్రేటర్ ఎన్నికల్లో పలువురు ప్రముఖుల వారసులకు,ప్రముఖలకు కూడా చుక్కెదురైంది. ఫలితాల్లో తెరాస దూసుకుపోతే ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ కుమారుడు మాత్రం ఓటమి పాలయ్యాడు. అలాగే కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్ తనయుడు విక్రమ్‌గౌడ్ సైతం పరాజయం పాలయ్యాడు. ఆయనను కాంగ్రెస్ తమ మేయర్ అబ్యర్థిగా ప్రకటించింది. జాంబాగ్ నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. మాజీమేయర్, తార్నాకలో కాంగ్రెస్ అభ్యర్థి బంగా కార్తీక రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సొంతంగా అధికారం చేపట్టేందుకు కావల్సిన మెజారిటీని సాధిస్తున్న టీఆర్‌ఎస్.. ఇక తమ మేయర్ అభ్యర్థి ఎవరన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించాల్సి ఉంది. కాంగ్రెస్ లాంటి పార్టీలు ముందుగా తమ మేయర్ అభ్యర్థులను ప్రకటించినా, టీఆర్‌ఎస్ మాత్రం ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. ప్రధానంగా మాత్రం చర్లపల్లి డివిజన్ నుంచి పోటీ చేసిన బొంతు రామ్మోహన్, బంజారాహిల్స్ డివిజన్ నుంచి పోటీ చేసిన ఎంపీ కే.కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మిల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. బొంతు రామ్మోహన్ ముందు నుంచి పార్టీలో చురుగ్గా వ్యవహరించారు. నగరం మొత్తం ఏదోలా తన పేరు వినిపించేలా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే.. కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి, అక్కడి నుంచి టీఆర్‌ఎస్‌కు వచ్చిన సీనియర్ నాయకుడు కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి పోటీ చేశారు. ఆమెకు కూడా సముచిత స్థానం ఇవ్వచ్చనే వాదన వినిపించింది. దీంతో ప్రధానంగా మేయర్ పదవి కోసం ఎక్కువ పోటీ బొంతు రామ్మోహన్, విజయలక్ష్మిల మధ్యే ఉంటుందని తెలుస్తోంది. మాదాపూర్ డివిజన్ నుంచి గెలిచిన జగదీశ్వర్ గౌడ్ పేరు కూడా ఓ దశలో వినిపించింది. అయితే ఆయన ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. మాదాపూర్ నుంచి ఆయన, హఫీజ్‌పేట నుంచి ఆయన భార్య పూజిత కార్పొరేటర్లుగా పోటీ చేశారు. తాము గెలిస్తే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ మేయర్ అవుతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా.. జాంబాగ్ డివిజన్ నుంచి పోటీ చేసిన విక్రమ్‌గౌడే ఓడిపోయారు.
ఫలించిన తారకమంత్రం
హైదరాబాద్‌లో తారకమంత్రం ఫలించింది. ఒంటిచేత్తో కెటి రామారావు చేసిన ప్రచారం, వ్యూహం ఫలించింది. ఆయన ప్రచారానికి అచ్చెరువొందిన సిఎం కెసిఆర్ మున్సిపల్ శాఖను అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రచారంలో దూకుడు ప్రదర్శంచి, విమర్శలకు దీటుగా జవాబిచ్చిననేతగా ప్రజల్లో మంచి ఫలితాన్ని రాబట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌లో సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ‘ఐకాన్ ఆఫ్ ద ఇయర్’గా అవార్డులు అందుకున్న కేటీఆర్ ‘నాన్నకు
ప్రేమతో’ బల్దియా పీఠాన్ని కానుకగా అందించారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని అధిరోహిస్తామని ఘంటాపథంగా చెప్పిన ఆయన.. ఆ మేరకు పార్టీ నేతల సమష్టి కృషితో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయకేతనాన్ని ఎగురవేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆయన అమలు చేసిన వ్యూహం ఫలించిందనే చెప్పవచ్చు. వంద డివిజన్లు గెలవకుంటే అంటూ అందరికి చెమటలు పట్టించారు. మొత్తం 150 డివిజన్లకు అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి రెబల్స్ను బుజ్జగించడం, ప్రచార బాధ్యతలు చేపట్టి, సుడిగాలి ప్రచారంతో కేటీఆర్ సుమారు వంద డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించి, ప్రత్యర్థులను బెంబేలెత్తించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడే అని నిరూపించారు. తన కాన్వాయ్ మొత్తం నగరంలో ప్రచారం కోసం తిరిగితే ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడతారంటూ.. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్షంగా ప్రచారం చేపట్టలేదు. కేవలం ఓ ప్రెస్ విూట్, ఒక్క బహిరంగ సభకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే.. ఆ లోటును కేటీఆర్ భర్తీ చేశారనే చెప్పొచ్చు. కేసీఆర్ పేరును పెంచకపోయినా ఫర్వాలేదు కానీ చెడగొట్టకుండా చూసుకుంటే తాను విజయం సాధించినట్లే అన్న కేటీఆర్.. దానికి మించిన స్థాయిలో విజయం సాధించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించడంతో సోషల్ విూడియాలో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో ‘నాన్నకు ప్రేమతో’ అనే స్లోగన్తో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మొత్తంగా 60ఏళ్ల కంపును 16 నెలలలో ఎలా పారదోలుతామంటూ చేసిన వ్యాఖ్యలు కూడా బాగా పనిచేశాయనే చెప్పొచ్చు.
కెటిఆర్‌కు అభినందనల వెల్లువ
హైదరాబాద్,ఫిబ్రవరి5(ఆర్‌ఎన్‌ఎ): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ తరపున అన్నీ తానై మంత్రులను, నేతలను, కార్యకర్తలను ఏకతాటిపై నడిపించి గులాబీ పార్టీకి గెలుపు సాధించిపెట్టిన మంత్రి కేటీఆర్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కారు దూసుకుపోతోందని తేలిపోయింది. ఈమేరకు మంత్రి కేటీఆర్‌కు పలువురు మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ప్రశంసలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. తెలంగాణభవన్‌కు వచ్చిన కేటీఆర్‌కు టీఆర్‌ఎస్ శ్రేణులు, వేల సంఖ్యలోకార్యకర్తలు చుట్టుముట్టి అభినందనలు తెలుపుతూ కనిపించారు. జైతెలంగాణ, జై కేటీఆర్ నినాదాలతో తెలంగాణభవన్ మార్మోగిపోయింది. సీనియర్ నేతలు డిఎస్, మంత్రులు తలసాని, జగదీశ్ రెడ్డి తదితరులు అభినందించారు.
టిఆర్‌ఎస్ గెలుపుతో రేవంత్, నారాయణల సవాళ్లపై చర్చ
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయబావుట ఎగురవేయడంతో టీఆర్‌ఎస్‌కు సార్వజనీనమైన ఆదరణ ఉందని ఈ ఫలితాలతో తేలిపోయిందని మంత్రి కెటిఆర్ అన్నారు. టీడీపీ నేత రేవంత్‌రెడ్డితోపాటు పలువురు ప్రతిపక్ష నేతలు చేసిన సవాళ్లను విలేకరులు గుర్తు చేయగా, వారి సవాళ్లను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు. తాము గెలిస్తే పొంగిపోమని, ఓడిపోతే కుంగిపోమని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు మనసు మార్చుకోవాలని హితవు పలికారు. గ్రేటర్ ప్రజలకు ఇచ్చిన హావిూలు తప్పకుండా నెరవేర్చుతామని, వారి నమ్మకాన్ని వమ్ము చేయమని తెలిపారు. ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరెంతో లెక్క తేలింది. ఇక మిగిలిందంతా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి రాజీనామానే. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు వందసీట్లు వస్తే రాజకీయం నుంచి తప్పుకుంటానని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అధికార పార్టీపైనా, సీఎం కేసీఆర్, మంత్రులపై నిరాధారమైన ఆరోపణలు, నోటికొచ్చినట్లు మాట్లాడి ప్రజల మెప్పు పొందాలని ప్రయత్నించిన రేవంత్ రెడ్డికి, ఆయన పార్టీ తెలుగుదేశానికి హైదరాబాద్ మహానగర ప్రజలు బుద్ది చెప్పారు. టీడీపీ-బీజేపీ కూటమి తోపాటు కాంగ్రెస్ పార్టీని ప్రజలు పాతరేశారు. గులాబీ పార్టీకి భ్రహ్మరథం పట్టారు. సీఎం కేసీఆర్
పరిపాలనకు హైదరాబాద్ ప్రజలు పట్టంగట్టారు. 100 సీట్లకు పైగా మునిసిపల్ కార్పొరేషన్ డివిజన్లలో టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లేసి గెలపించారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి వంద సీట్లు వస్తే చెవి కోసుకుంటానన్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట విూద నిలబడతారో లేదో చూడాలి. చేయని సవాల్‌ను సుమోటోగా స్వీకరించిన నారాయణ హైదరాబాద్ ప్రజల తీర్పును ఏవిధంగా జీర్ణించుకుంటారో చూడాలి. అయితే ఓ విూడియా సంస్థతో నారాయణ ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ టీఆర్‌ఎస్ వంద సీట్లు గెలిస్తే చెవి కోసుకుంటానని నారాయణ చేసిన వ్యాఖ్యలను వ్యాఖ్యాత గుర్తు చేయగా నారాయణ స్పందిస్తూ… ఇలాంటివి స్పోర్టీవ్‌గా తీసుకోవాలని అన్నారు. ఏదో ఎన్నికల్లో ఎన్నో మాటలు అంటుంటామని వాటిని పట్టించుకోకూడదని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కూడా మాటలను పొదుపుగా వాడుకోవాలా ఏంటీ? అని ఎదురు ప్రశ్న వేశారు. విూరు స్పోర్టీవ్‌గా తీసుకుంటున్నారు, కానీ ప్రజలు సీరియస్‌గా తీసుకున్నారు కదా అని వ్యాఖ్యాత ప్రశ్నించగా నారాయణ స్పందించలేదు.
టిఆర్‌ఎస్ నుంచి ప్రముఖుల బిడ్డలు గెలుపు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గెలుపొందింది. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ నుంచి పలువురు ప్రముఖులు గెలుపొందారు. కొందరు మేయర్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. ఖైరతాబాద్ డివిజన్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఘనవిజయం సాధించారు. 12 వేల ఓట్ల మెజార్టీతో ఆమెకు ఖైరతాబాద్ డివిజన్ ప్రజలు విజయం కట్టబెట్టారు. గెలుపుకు కారణమైన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి అరుణజ్యోతి, టీడీపీ నుంచి సంగీత పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసినా విజయం సాధించలేదు. ఇక టీఆర్‌ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మీ గెలుపొందారు. బంజారాహిల్స్ నుంచి విజయలక్ష్మీ పోటీ చేశారు. బంజారాహిల్స్ ప్రజలకు విజయలక్ష్మీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నుంచి బొల్ల బోయిన రాజుయాదవ్, బీజేపీ నుంచి మంచినేని శ్రీనివాస్‌రావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అలాగే టీఆర్‌ఎస్ యువనేత బొంతు రామ్మోహన్ విజయం సాధించారు. చర్లపల్లి డివిజన్ నుంచి రామ్మోహన్ పోటీ చేసి గెలుపొందారు. రామ్మోహన్ గెలుపొందడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రచారంలో కూడా బొంతు రామ్మోహన్‌కు అపూర్వ ఆదరణ లభించింది. ఇక్కడ బీజేపీ నుంచి గణేష్, కాంగ్రెస్ నుంచి మహేశ్ పోటీ చేశారు. రాంనగర్ డివిజన్ నుంచి ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందడంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయఢంకా మోగించింది. 150 డివిజన్లకు గానూ టీఆర్‌ఎస్ 100 స్థానాలపైనే గెలిచింది. బోరబండ నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ యువనేత బాబా ఫసియూద్దీన్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఫసియూద్దీన్ గెలుపొందడంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు.
ప్రజాతీర్పును శిరసావహిస్తాం: టిడిపి
గ్రేటర్ ఎన్నికల్లో ప్రజల తీర్పు శిరసావహిస్తామని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాలు విశ్లేషించుకుని ఓటమికి గల కారణాలపై మదింపు చేసుకుంటామన్నారు. ప్రజల సమస్యలపై ఇకముందూ పోరాడుతామని అన్నారు. ఊహించని విధంగా ఫలితాలు వెలవడటంపై కారణాలను సవిూక్షిస్తామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. క్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు తెతెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హావిూలను ప్రభుత్వం నెరవేర్చాలని సూచించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్‌పై స్పందిస్తూ… ఆయనే చివరకు వెనక్కి తగ్గారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో బిజెపిమూడు డివిజన్లలో విజయం సాధించింది. ఆర్కేపురం, ఘన్సిబజార్, బేగంబజార్ డివిజన్లలో భాజపా అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. టిడిపి కేవలం ఒక్కస్థానాన్ని మాత్రమే గెల్చుకుంది.





