డివిజన్లలో పర్యటిస్తూ నేరుగా ప్రజలతో మంతనాలు
ఓట్లు రాబట్టే క్రమంలో ఓటర్లకు గాలం
హైదరాబాద్,నవంబర్30 (జనం సాక్షి): గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పట్టుకోసం టిఆర్‌ఎస్ నగర నేతలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలు బాగా కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో డివిజన్ల వారీగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడంతో వారికి ఇవి సవాల్‌గా మారాయి. ఈ ఎన్నికలు భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. బిజెపి కూడా తమ పార్టీకి చెందిన నేతలకు బాధ్యతలు అప్పగించింది. దీంతో అధికార పార్టీ నేతలు ఆదివారం సాయంత్రం ప్రచారం ముగిసిన వెంటనే నేరుగా రంగంఓలకి దిగారు. ఆది,సోమవారాల్లో నేరుగా ప్రజలను కలిసిలి ఓటేసుకునేలా ప్రమాణాలు చేయించారు. తాయిలాలు చూపారు. పలుచోట్ల పంపకాలు చేపట్టారు. కులపెద్దలను, స్థానిక ఛోటామోటా లీడర్లను చేరదీసి ఓటు వేయించే బాధ్యతలను అప్పగించడం విశేషం. ముఖ్యంగా అధికార పార్టీ నేతలకు సవాల్‌గా మారాయి. గత గ్రేటర్ ఎన్నికల్లో శివార్లలో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన టీఆర్‌ఎస్‌కు శివార్లలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. అనేక చోట్ల బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తూ కారుకు సవాళ్లు విసురుతోంది. ఈ నేపథ్యంలో మంత్రులు తలసాని, మల్లారెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మారావు, సబితారెడ్డి లతో పాటు శివారు ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గ్రేటర్ ఎన్నికలు సవాల్‌గా మారాయి. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ప్రతికూల ఫలితాలు వస్తే ఇటు టీఆర్‌ఎస్ పార్టీతోపాటు వ్యక్తిగతంగా కూడా భారీ మూల్యాన్ని చెల్లించు
కోవాల్సి వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నాటితో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీగా ఓట్లు కోల్పోయింది. శివారు ప్రాంతాల్లో ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో టీఆర్‌ఎస్ ఓటమి పాలైంది. చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో స్వల్ప మెజార్టీతో బయటపడింది. అయితే, గ్రేటర్ ఎన్నికల్లో పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ ఎదుర్కొన్న టీఆర్‌ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీతో సవాల్ ఎదుర్కొంటోంది. అందుకే మంత్రి తలసాని ప్రధానంగా ఇక్కడ ఓట్లను లాగే పనిలో పడ్డారు. మతం/-రి మల్లారెడ్డి, సబిత కూడా ఇదే క్రమంలో శ్రమిస్తున్నారు.
గ్రేటర్ పరిధి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 64 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 62 డివిజన్లలో టీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్, బీజేపీలకు చెరొకటి వచ్చాయి. ఈ స్థానాలను గణనీయంగా పెంచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఒక్క ఆర్కేపురం డివిజన్‌లో విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు శివార్లలో సగం స్థానాలకుపైగా గురిపెట్టింది. అనేక చోట్ల అధికార పార్టీతో నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీపడింది. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో నాచారం డివిజన్‌లో మాత్రమే విజయం సాధించగా ఈసారి రెండు డిజిట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కువ దృష్టిసారించింది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌కు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయం గా ఓటు బ్యాంకు సాధించిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పరపతి కాపాడుకునే యత్నం చేస్తోంది. రేవంత్‌రెడ్డికి కూడా ఈ ఎన్నికలు సవాల్‌గా మారాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ పరిధిలో ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో కూకట్‌పల్లి డివిజన్‌లో మాత్రమే విజయం సాధించిన టీడీపీ ఈసారి ఈ సంఖ్యను పెంచుకునే యత్నం చేస్తోంది. మొత్తంగా నేతలు ఇప్పుడు వివిధ డివిజన్లలో పాదయాత్రలతో ముఖ్యనేతలను కలుస్తూ ఓట్లను రాబట్టే పనిలో పడ్డారు.
గ్రేటర్ నేతలకు కంటివిూద కునుకు కరువు




