Tuesday, 3 November 2026

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మి నర్సింహ రెడ్డి

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మి నర్సింహ రెడ్డి

మోత్కూరు నవంబర్ 29 జనంసాక్షి : మండలంలోని పాటిమట్ల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బండి రాజు తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దాచారం గ్రామంలో కడమంచి యాదగిరి ఇటీవల అనారోగ్యంతో మరణించగా మంగళవారం మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మి నర్సింహ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఇరువురు కుటుంబ సభ్యులకు రూ. 5 వేలు చొప్పున మొత్తం గా 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు దండబోయిన మల్లేష్,అండెం రజిత రాజిరెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, రైతుబంధు మండల అధ్యక్షుడు కొండ సోమలు, గ్రామ శాఖ అధ్యక్షులు కడమంచి వస్తా,మంగపట్ల మల్లయ్య,కప్ప లింగయ్య,కొమురయ్య,జింకల కిష్టయ్య,గిరగాని శ్రీనివాస్,బూడిద ప్రవీణ్,దొండ దశరథ,దొండ పవన్,గనగాని రాజేష్,దండ బోయిన మధు,కడమంచి శ్రీను,సైదులు,కురుమేటి అంజయ్య,కురుమేటి సైదులు,గోవర్ధన్,దొండ రాజు తదితరులు పాల్గొన్నారు.